పూర్వకాలపు దధీచి నుండి ఈ కాలపు సత్యసాయి వరకు భూమి మీద అవతరించిన ప్రతీ గురువు యొక్క లక్ష్యము ఏమిటంటే, భూమిని స్వర్గముగా మార్చటము అని మాస్టర్ ఆర్.కె. చెప్పేవారు.

భూమి స్వర్గముగా మారాలి అంటే, భూమి మీద ఉన్న మానవజాతి మాత్రమే కాకుండా, సమస్త ప్రాణులు ఒకే కుటుంబముగా జీవించాలి.

ఒకే కుటుంబములోని సభ్యుల మధ్య ఏ విధముగా అయితే పరస్పర ఆప్యాయతలు ఉంటాయో, అదే విధముగా భూమి మీద ఉన్న అన్ని ప్రాణుల మధ్య ఆత్మీయత ఉండాలి.

ఈ సామూహిక ఆత్మీయత వలన మనుష్యులలో దేవత్వము ఉదయించి, మానవజాతి దేవమానవజాతిగా పరిణతి చెందుతుంది.

మనుష్యులలో వసుధైక కుటుంబ భావన రావాలి అంటే, ఈనాటి మన ఆలోచనా విధానము, ఆర్ధిక విధానము, విద్యా విధానము మారాలి.

ఈ మార్పుకు సంబంధించిన విషయాలు స్వర్ణయుగము మాసపత్రికలో తెలియజేస్తున్నాము.

స్వర్ణయుగము పత్రికకు సభ్యులు అవటము ద్వారా ఈ దైవీ ప్రణాళికలో భాగస్వాములు కావలసినదిగా కోరుచున్నాము.

పత్రిక సంవత్సర చందా : రూ. 600. కంట్రిబ్యూషన్ : రూ. 1200

any sort of website counter